భారతదేశం, నవంబర్ 24 -- Gondhal Oscars: ప్రతిష్ఠాత్మక 99వ అకాడమీ అవార్డుల (Oscars 2027) వేటలో ఇండియా తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ థ్రిల్లర్ చిత్రం 'గోంధల్' (Gondhal).. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) తాజాగా విడుదల చేసిన 104 చిత్రాల అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అర్హత జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఆస్కార్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అంతర్జాతీయ చిత్రాలు, డాక్యుమెంటరీలు, యానిమేషన్ సినిమాలు పోటీపడుతుండటం విశేషం.

మహారాష్ట్ర సంప్రదాయ జానపద ఆచారం 'గోంధల్' నేపథ్యంలో, ఒక్క రాత్రిలో జరిగే ప్రేమ, వంచన, హత్యల చుట్టూ సాగే ఈ థ్రిల్లర్ డిసెంబర్ 15న వెలువడనున్న టాప్-15 షార్ట్‌లిస్ట్ కోసం పోటీపడనుంది.

అకాడమీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈసారి 'ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభా...