భారతదేశం, నవంబర్ 22 -- 2025 నుంచి 2026 మధ్య కేవలం ఏడాది వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్లలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది! ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి, వెండి ర్యాలీ ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఒక అందమైన కల నుంచి పీడకలగా మారింది. ఈ ఏడాది జనవరిలో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను తాకిన ఈ రెండు విలువైన లోహాలు, ఆ తర్వాత తీవ్రమైన దిద్దుబాటుకు (కరెక్షన్) గురై మదుపర్ల సంపదలో భారీ భాగాన్ని తుడిచిపెట్టేశాయి.

జనవరి గరిష్ట స్థాయిల నుంచి ఇప్పటివరకు బంగారం ధర 31.5 శాతం పడిపోగా, వెండి ఏకంగా 64.2 శాతం కుప్పకూలింది. గరిష్ట ధరల వద్ద ఆభరణాలు, బంగారు నాణేలతో పాటు ఎక్స్​ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఈ పతనంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఉదాహరణకు, మీరు జనవరి గరిష్ట స్థాయిలో బంగారంపై రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే,...