భారతదేశం, నవంబర్ 15 -- Giri Babu: గిరిబాబు అంటే ఆయన స్క్రీన్ నేమ్ మాత్రమే. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లాలోని రావినూతల అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. సినిమాల మీద ఉన్న మక్కువతో మద్రాసు రైలు ఎక్కిన ఆయన తన పేరును గిరిబాబుగా మార్చుకుని ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. గిరిబాబు ఇండస్ట్రీకి వచ్చింది విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కాదు. హీరో కావాలనే కోరికతో! 1973లో వచ్చిన 'జగమే మాయ' సినిమాతో ఆయన విలన్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. కానీ ఆయన గంభీరమైన కంఠం, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఆయనకు నెగెటివ్ రోల్స్ ఎక్కువగా ఆఫర్ చేశారు. 'కురుక్షేత్రం' సినిమాలో ఆయన పోషించిన దుశ్శాసనుడి పాత్ర ఆయన కెరీర్ న...