భారతదేశం, ఆగస్టు 13 -- Gen Z: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో జాతీయ రాజకీయాల్లో రచ్చ లేపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్ జీ (Gen Z) నిరసనలపై ఆమె చేసిన 'జనరేషన్ గట్టర్' కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై స్పందించిన కంగనా.. అక్కడ నిరసన తెలిపింది అసలైన జెన్ జీ యూత్ కాదని, 'షబానా అజ్మీ టైప్ జనాలు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక స్పెషల్ వీడియో షేర్ చేసిన కంగనా రనౌత్.. తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్నారు. "మన దేశంలో దాదాపు 30 నుంచి 35 కోట్ల మంది జెన్ జీ జనాభా ఉన్నారు. కానీ జంతర్ మంతర్ దగ్గర కేవలం 10 వేల మంది మాత్రమే పోగయ్యారు. అందులో సగానికి పైగా షబానా అజ్మీ టైప్ వయస్సు ఉన్నవాళ్లే కనిపించారు" అని కంగనా వ్యంగ్యంగా మాట్లాడారు.

అక్కడ ఉన్న ...