భారతదేశం, ఆగస్టు 27 -- Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' డివైడ్ టాక్‌తో రచ్చ లేపుతోంది. రూ.140 కోట్ల పైచిలుకు వరల్డ్‌వైడ్ డే 1 కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. ఆడియన్స్ నుంచి వస్తున్న ట్రోల్స్ యశ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాక్సిక్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెటిజన్లు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ 2021లో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూను బయటకు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిల్మ్ కాంపాన్సియన్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో గీతూ తన రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టిం...