భారతదేశం, ఏప్రిల్ 22 -- Gayapadda Simham: తన అప్ కమింగ్ మూవీ 'గాయపడ్డ సింహం' ప్రమోషన్లతో డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్ మరోసారి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఏఐతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీడియోలు క్రియేట్ చేసి గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను తరుణ్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. తాజాగా ట్రంప్ తో ఇరానీ చాయ్ తాగించాడు తరుణ్ భాస్కర్.

గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రచారాన్ని అతను డిఫరెంట్ గా నిర్వహిస్తున్నాడు. తాజాగా ట్రంప్ తో కలిసి తరుణ్ టీ తాగుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. ఇందులో ట్రంప్, ఇరానీ టీ జోక్ పేలింది.

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి యుద్ధం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్ తన గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు. ట్రంప్ పక్కన కూర్చుని టీ తాగుతున్నట...