భారతదేశం, సెప్టెంబర్ 1 -- Gautham Toxic Review: సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని షేర్ చేసిన మూవీ రేటింగ్స్ ఇప్పుడు టాలీవుడ్ నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ సినీ రివ్యూ ప్లాట్‌ఫామ్ 'లెటర్‌బాక్స్‌డ్' (Letterboxd)లో గౌతమ్ ఐడీ బయటపడటంతో, అతను వేర్వేరు సినిమాలకు ఇచ్చిన రేటింగ్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ భారీ ఆశలతో తీసుకొచ్చిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic)కి గౌతమ్ కేవలం 0.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన యశ్ 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అయితే కంటెంట్ సరిగా లేకపోవడంతో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో గౌతమ్ తన లెటర్‌బాక్స్‌డ్ అకౌంట్‌లో ఈ సినిమాకు అత్యంత దారుణంగా హాఫ్ స్టార్...