భారతదేశం, ఆగస్టు 24 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి గేట్ 2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆగస్ట్​ 25, 2025న ప్రారంభించనుంది. గేట్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 25, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6, 2025.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ కింది దశలను అనుసరించాలి:

స్టెప్​ 1- గేట్ 2026 అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.inని సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే "గేట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్"పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక...