భారతదేశం, అక్టోబర్ 11 -- గేట్ 2026 (గ్రాడ్యుయేట్​ యాప్టిట్యూడ్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి. ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం!

గేట్​ 2026 రాయాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 13, 2025 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అయితే, ఇందుకోసం నిర్దేశించిన అదనపు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఐఐటీ అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గతంలో, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 9, 2025 వరకు ఉండేది. దాన్ని పొడిగిస్తున్నట్టు ఐఐటీ గౌహతి తెలిపింది.

పొడిగించిన దరఖాస్తు గడువులో అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

ఈ ఏడాది గేట్ 2026 పరీక...