భారతదేశం, మే 3 -- Hyderabad Traffic Police Summer Camp : హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలతో మమేకమవడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులైన చిన్నారుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి మరో అడుగు ముందుకు వేశారు. 'సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్'లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని చిన్నారుల ముందుకు తెచ్చింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

ఈ శిక్షణ శిబిరం కేవలం రోడ్డు భద్రతకే పరిమితం కాకుండా, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా డిజైన్ చేశారు. మే 11, 2026 నుంచి మే 16, 2026 వరకు వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో నేర్పించే ...