భారతదేశం, సెప్టెంబర్ 2 -- Flop Star: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడి సక్సెస్ గ్రాఫ్‌ను అతను సాధించే బాక్సాఫీస్ హిట్‌లే డిసైడ్ చేస్తాయి. వరుసగా ఫ్లాప్‌లు వస్తే ఏ స్టార్ హీరో కెరీర్ అయినా డేంజర్‌లో పడటం సహజం. కానీ ఇండియన్ సినిమాలో ఒక లెజెండరీ యాక్టర్ మాత్రం ఈ లాజిక్‌ను పూర్తిగా మార్చేశారు. ఏకంగా 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 180 ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ లీడ్ యాక్టర్‌గా నిలిచారు. ఆయనే బాలీవుడ్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి.

1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తీసిన 'మృగయా' సినిమాతో మిథున్ చక్రవర్తి తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. 1980ల ప్రారంభంలో 'షౌకీన్', 'అశాంతి' లాంటి హిట్‌లతో మంచి ట్రాక్ సాధ...