భారతదేశం, జూలై 20 -- న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ కొత్త ఫిఫా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్రాత్మక విజయంతో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ట్రోఫీని ముద్దాడటమే కాకుండా, ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయి ప్రైజ్​ మనీని కూడా సొంతం చేసుకుంది. మరోవైపు, నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో గెలిచిన టైటిల్‌ను కాపాడుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుని, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా సైతం భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది.

డిసెంబర్ 2025లో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశ నిర్ణయం ప్రకారం.. 2026 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీని ప్రకటించారు. టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు వారు నిలిచిన స్థానాన్ని బట్టి ఈ బహుమతి మొత్తంలో వాటాను పంపిణ...