భారతదేశం, జూన్ 11 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రీడాభిమానులను ఉర్రూతలూగించే 'ఫిఫా ప్రపంచకప్ 2026' మహా సమరానికి సర్వం సిద్ధం! నేటి రాత్రి నుంచి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ సాకర్ పండుగను వీక్షించేందుకు భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు కూడా టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవడానికి రెడీ అయిపోయారు. భారతదేశంలో ఈ మెగా టోర్నమెంట్‌ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం 'జీ ఎంటర్‌టైన్‌మెంట్' కైవసం చేసుకుంది. దీనితో మ్యాచ్‌లన్నీ వారి కొత్త స్పోర్ట్స్ ఛానెల్ 'యునైట్8'లో బుల్లితెరపై ప్రత్యక్ష ప్రసారం కానుండగా, 'జీ5' ఓటీటీ యాప్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.

రాబోయే నెల రోజుల పాటు మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే అంటూ ఫుట్‌బాల్ అభిమానుల మధ్య చర్చలు, గొడవలు సర్వసాధారణం కానున్నాయి. అయితే, ప్రప...