భారతదేశం, సెప్టెంబర్ 22 -- Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా 'ఫౌజీ' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 4 ఎప్పుడు వస్తుందా? అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులకు ఫౌజీ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన మైత్రి రవిశంకర్ పిడుగులాంటి వార్త చెప్పారు. వెంటనే అదిరిపోయే అప్డేడ్ కూడా ఇచ్చారు.

ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' మూవీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ ముందుగా ప్రకటించినట్లు డిసెంబర్ 3, 2026న రిలీజ్ కావడం లేదు. చిత్రం విడుదల వాయిదా పడ్డట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు.

డిసెంబర్ 3, 2026న విడుదల కావాల్సిన 'ఫౌజీ' సినిమా కొద్దిగా లేట్ గా థియేటర్లకు వస్తుందని ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ ప్రకటించారు. డిజిటల్, సీజీఐ (CGI), విఎఫ్ఎక్స్ (VFX) పనులు అనుకున్న సమయానికి పూర్తి కా...