భారతదేశం, అక్టోబర్ 29 -- నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం డబ్బు కట్టి ఆ టోల్ ప్లాజాను దాటే స్థానికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాతీయ రహదారుల టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రైవేటు వాహనదారుల కోసం ప్రత్యేకంగా రాయితీతో కూడిన 'ఫాస్టాగ్ లోకల్ పాస్' విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.

ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతీరోజూ ఒకే టోల్ గేటు ద్వారా ప్రయాణిస్తూ అధిక ఛార్జీల భారం మోస్తున్న కోట్లాది మంది వాహనదారులకు ఈ నిర్ణయంతో గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభించనుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే జాతీయ రహదారుల పరిధిలోని స్థానిక ప్రజలకు కూడా ఈ పథకం ఎం...