భారతదేశం, అక్టోబర్ 31 -- పండుగల వేళ కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం 'హీరో మోటోకార్ప్' అదిరిపోయే శుభవార్త అందించింది. కస్టమర్లను ఆకట్టుకునేలా తన ప్రజాదరణ పొందిన డెస్టినీ 110 లైనప్‌లో సరికొత్త 'క్లాసిక్ ఎడిషన్'ను మార్కెట్లో ఆవిష్కరించింది.

రూ. 76,400 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్.. క్లాసిక్ వింటేజ్ లుక్స్, మోడ్రన్ ఫీచర్లతో క్లాస్సీగా కనిపిస్తోంది. పండుగ సీజన్​లో కారులాంటి ప్రీమియం ఫినిషింగ్ ఉన్న స్కూటర్‌ను తీసుకురావడం వల్ల మధ్యతరగతి, ఫ్యామిలీ రైడర్లను హీరో మోటోకార్ప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. పైగా దీని ధర కూడా తక్కువే!

డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్‌ ఫ్యామిలీ స్కూటర్​లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, డిజైన్, బాహ్య రూపురేఖల్లో సరికొత్త నియో-రెట్రో శైలిని అందించారు. కస్టమర్...