భారతదేశం, ఏప్రిల్ 26 -- Family Man 4: ఓటీటీని షేక్ చేసిన స్పై థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి కొత్త సీజన్ రాబోతుంది. ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ నవంబర్ 21, 2025న విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క్లైమాక్స్ లో సస్పెన్స్ తో తర్వాతి సీజన్ పై మేకర్స్ అంచనాలు పెంచేశారు.

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సీజన్లు వచ్చాయి. ఇక నాలుగో సీజన్ కోసం కూడా మేకర్స్ రంగంలోకి దిగారు. ఇప్పటికే స్క్రిప్ట్ రైటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం.

ఓటీటీ బ్లాక్ బస్టర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ నుంచి సీజన్ 4 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ 4 రావడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ...