భారతదేశం, మార్చి 14 -- నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్సు మ్యాథమేటిక్స్ పరీక్ష కోసం వరుణ్ సందేశ్ అనే ఒకే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరు కావడానికి షెడ్యూల్ కూడా ఉంటుందిగా.. ఈ సమయానికి అధికారులు అందరూ ఎగ్జామ్ సెంటర్ వచ్చారు.

అయితే విద్యార్థి వరుణ్ మాత్రం అధికారులకు ట్విస్ట్ ఇచ్చాడు. పరీక్ష రాయడానికి రాకపోవడంతో అధికారుల ప్రయత్నాలు వృథా అయిపోయాయి. దీంతో సిబ్బంది పరీక్ష కేంద్రంలో పరీక్ష టైమ్ అయ్యేదాకా వేచి ఉన్నారు. ఒక విద్యార్థి కోసం ఐదుగురు సిబ్బందితో కూడిన ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.

పరీక్షకు హాజరు కావాల్సిన కమ్మరి వరుణ్ సందేశ్ మాత్రం ట్విస్ట్ ఇచ్చి పరీక్షకు హాజరుక...