EV sales : పండుగ సీజన్‌లో ఈవీల దూకుడు.. అమ్మకాల్లో 52.62% వృద్ధి!
భారతదేశం, నవంబర్ 28 -- ఈ ఏడాది పండుగ సీజన్‌లో దేశ ఆటోమొబైల్ రంగం సాధించిన రికార్డు రిటైల్ అమ్మకాలకు ఎలక్ట్రిక్ వాహనాలే (ఈవీ) ప్రధాన చోదక శక్తిగా నిలిచాయి! అక్టోబర్ 11 నుంచి నవంబర్ 21 మధ్య 42 రోజుల వ్యవధిలో 5,09,667 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టరైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 3,33,935 యూనిట్లతో పోలిస్తే ఈవీల అమ్మకాలు 52.62 శాతం పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో దసరా, దీపావళి వేళ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోళ్లపై వినియోగదారులు భారీగా మొగ్గు చూపారు. పెట్రోల్, డీజిల్ ధరల భారం, ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ, కొత్త మోడళ్ల రాకతో పండుగ విక్రయాల్లో ఈవీల హవా స్పష్టంగా కనిపించింది. మొత్తం వాహన రిజిస్ట్రేషన్ల నికర వృద్ధి కంటే, ఈవీల రిజిస్ట్రేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.