భారతదేశం, నవంబర్ 20 -- ENE Repeat Collections: యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'ఈఎన్‌ఈ రిపీట్' (ENE Repeat) థియేటర్లలో నవ్వుల తుఫాను సృష్టిస్తోంది. నవంబర్ 19న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ప్రజల కోసం తీసిన సినిమాను ప్రజలే పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ చిత్ర బృందం తాజాగా అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, 'ఈఎన్‌ఈ రిపీట్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

2018లో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 1 తన పూర్తి థియేట్రికల్ రన్‌లో సుమారు రూ. 12 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, ఇప్పుడు సీక్వెల్ మాత్రం కేవలం ...