భారతదేశం, సెప్టెంబర్ 22 -- Endhayyasaami Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'రణబాలి' మ్యూజికల్ ప్రోమోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికే భారీ ట్రెండింగ్ సృష్టించగా, తాజాగా విడుదలైన 'ఏందయ్యా సామి' ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను రూల్ చేస్తోంది.

రణబాలి నుంచి వచ్చిన ఏందయ్య సామి పాటలో 1850ల కాలం నాటి గ్రామీణ వాతావరణం, సాంప్రదాయ పెళ్లి తంతు, కొత్త జంట ముచ్చట్లను చాలా అందంగా చూపించారు. విజయ్ దేవరకొండ 'రణబాలి' పాత్రలో రగ్గడ్ అండ్ రోమాంటిక్ లుక్‌లో కనిపిస్తే, రష్మిక 'జయమ్మ' పాత్రలో క్లాసిక్ తెలుగు అమ్మాయిగా మెరిసిపోయింది.

గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఆడియన...