భారతదేశం, ఆగస్టు 29 -- భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను తాజాగా లాంచ్ చేసింది. అదే టీవీఎస్ ఆర్బిటర్. ఈ ఈ-స్కూటర్​ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,900. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్ ఎలిమెంట్స్​ కొద్దిగా కనిపిస్తాయి. ఫీచర్స్ పరంగా చూస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అధునాతనంగా, ఉపయోగకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

డిజైన్ పరంగా.. టీవీఎస్​ ఆర్బిటర్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొంచెం ఫంకీగా ఉన్నా, ఆధునికత ఉట్టిపడుతుంది. దీనికి లభించే ఆకర్షణీయమైన రంగులు ప్రత్యేకంగా నిలుస్తాయి. డిజైన్ మొత్తం పర్పస్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా ఉంది. దీని సీటు పొడవు 845 ఎంఎం. కాగా, ఫ్లోర్‌బోర్డ్ 290 ఎంఎంతో విశాలంగా ఉంది. హ్యాండిల్‌బార్ రైడర్ సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలు...