భారతదేశం, జూన్ 16 -- గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో పోటీ తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'ఎంజీ మోటార్' తన సరికొత్త, గ్లోబల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన మొదటి టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. 2026 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ వేదికగా ఈ కారును ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అంతర్జాతీయ మార్కెట్లో బీ-సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ సరికొత్త ఈవీ.. వోక్స్‌వ్యాగన్ ఐడీ పోలో, రెనాల్ట్ 5 ఈ-టెక్, ప్యుజో ఈ-208 వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి దీని సాంకేతిక వివరాలను కంపెనీ రహస్యంగా ఉంచినప్పటికీ, టీజర్ చిత్రాల ద్వారా ఈ కారు డిజైన్...