Electric car : 500 కి.మీ రేంజ్‌తో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, ఆగస్టు 29 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. సగటు భారత వినియోగదారుడి బడ్జెట్‌కి అందుబాటులో ఉండేలా, సరికొత్త సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2026 చివరి త్రైమాసికం (క్యూ4)లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ఈ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు.
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోకుండా, పూర్తిగా భారతీయ కస్టమర్ల అవసరాలు, స్థానిక రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. భారత మార్కెట్లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ వంటి మైక్రో ఎస్‌యూవీల విభాగానికి గట్టి పోటీ ఇచ్చేలా దీని ధరను నిర్ణయించనున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.