భారతదేశం, ఆగస్టు 26 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్​ కారు 'ఈ విటారా' ఉత్పత్తిని ప్రారంభించింది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారుతీ సుజుకీ అడుగుపెట్టింది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. ఈ-విటారా తొలి యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 3 నాటికి భారత మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్​ కారు 100 దేశాలకు ఎగుమతి కానుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, భారతదేశంలో జపాన్ రాయబారి కీచి ఓనో కూడా పాల్గొన్నారు. ఈ విటారా అనేది మారుతీ సుజుకీకి మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ). ఇది ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ఉత్పత...