భారతదేశం, ఏప్రిల్ 13 -- భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు క్లాసిక్ వారసత్వంతో వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' అందరిని ఆకర్షిస్తుంటే.. మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ, పవర్‌తో అల్ట్రావైలెట్ ఎఫ్77 దూసుకెళుతోంది. ఈ రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వీటి పనితీరు మాత్రం పూర్తి భిన్నం. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ధర పరంగా చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 కొంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6: రూ. 2.79 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

అల్ట్రావైలెట్ ఎఫ్77 (Mach 2/SuperStreet): రూ. 2.99 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

కేవలం Rs.20 వేల వ్యత్యాసమే ఉన్నప్పటికీ, ఈ ...