భారతదేశం, జూన్ 25 -- వెనెజువెలా దేశాన్ని బుధవారం సాయంత్రం వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి! కొద్ది నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాల వల్ల రాజధాని కారకాస్​తో పాటు ఆ దేశంలోని పలు నగరాలు తీవ్రంగా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా భూ ప్రకంపనల ధాటికి కారకాస్ నగరంలో పలు భవనాలు, నివాస గృహాలు కుప్పకూలాయి.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్​జీఎస్) నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం మొదట 7.1 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. దీని కేంద్రం కారకాస్ నగరానికి పశ్చిమంగా 168 కిలోమీటర్ల (104 మైళ్లు) దూరంలో ఉన్న తీరప్రాంతం 'మొరోన్'కు పశ్చిమ భాగంలో, భూమికి 13 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఈ ప్రకంపనలు వచ్చిన కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే అంతకంటే శక్తివంతమైన 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొ...