భారతదేశం, జూన్ 5 -- గత కొన్ని ఏళ్లుగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశంపై పడుతున్న భారీ ఇంధన దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (ఇథనాల్ బ్లెండింగ్) అనే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన 'ఈ20' ఇంధనాన్ని ప్రాథమికంగా దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. అయితే, దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూ.. ఈరోజు ఈ85ని ప్రభుత్వం లాంచ్​ చేయనుంది. అనంతరం ఈ100 కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ సరికొత్త ఈ85, ఈ100 ఇంధనాలకు సంబంధించి వాహనదారుల మనసులో మెదిలే ప్రతి ఒక్క ప్రశ్నకు నిపుణుల విశ్...