భారతదేశం, మార్చి 3 -- భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర సాంస్కృతిక రాయబారులుగా మార్చే లక్ష్యంతో 'డ్రైవర్-కమ్-గైడ్' శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 24న విజయవాడలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. డ్రైవర్లను ప్రయాణికులను తీసుకెళ్లడానికి మాత్రమే కాకుండా.. ఈ ప్రాంత గొప్ప చరిత్ర, వారసత్వం, పర్యాటక ఆకర్షణలను కూడా పరిచయం చేస్తారు.

ఆటో నగర్‌లోని పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన రెండు రోజుల శిక్షణా సెషన్‌లో 32 మంది క్యాబ్ డ్రైవర్లు, 248 ఆటో డ్రైవర్లతో సహా 280 మంది డ్రైవర్లు.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శేషగిరి రావు, మార్కెటింగ్ సీఈఓ పద్మరాణి శీల పర్యవేక్షణలో నిర్మాణాత్...