భారతదేశం, మే 21 -- Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ వచ్చి 24 గంటలు కూడా కాకముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ను 'లూగర్' (Luger) అనే అత్యంత పవర్‌ఫుల్, షార్ప్ అసాసిన్ పాత్రలో ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. థియేట్రికల్ విజువల్స్ పక్కన పెడితే.. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ లేని విధంగా చాలా సన్నగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ లుక్ వెనుక తారక్ పడిన కఠోర శ్రమను దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటపెట్టారు.

నిజానికి ఎన్టీఆర్‌ను ఇంత సన్నగా మార్చాలనేది మొదట అనుకున్న ప్లాన్ కాదట. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన ప్రీ-ప్రొడక్షన్ లుక్ టెస్టుల సమయంలో ఈ ఆలోచన వచ్చింది. సాధారణ యాక్షన్ హీరో బాడీ కంటే ఈ ఇంటెన్స్ హంతకుడి పాత్రకు కొంచెం భిన్నమైన లుక్ ఉంటే బాగుంటుందని...