భారతదేశం, జూలై 10 -- DQ41: తెలుగు ప్రేక్షకులకు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) అంటే కేవలం ఒక డబ్బింగ్ హీరో కాదు. 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోలకు సమానమైన మార్కెట్, అపారమైన లేడీ ఫాలోయింగ్‌ను అతను సొంతం చేసుకున్నాడు. తాజాగా తన కెరీర్‌లో 41వ మూవీ టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు.

దుల్కర్ సల్మాన్ కెరీర్ లో 41వ (DQ41) చిత్రంగా తెరకెక్కుతున్న మల్టీలింగ్వల్ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఇవాళ (జూలై 10) అఫీషియల్‌గా ప్రకటించారు. డెబ్యూ డైరెక్టర్ రవి నేలకుడితి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి 'శ్రీ శ్రీ' (#Sri Sri) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ప్రస్తుతం గూగుల్‌లో DQ41 title Sri Sri update కోసం నెటిజన్లు విపరీతంగా వె...