భారతదేశం, సెప్టెంబర్ 16 -- Disco Shanthi: 'రియల్ స్టార్' శ్రీహరి సతీమణి, ఒకప్పటి సౌత్ ఇండియా స్టార్ డాన్సర్ డిస్కో శాంతి ఆసుపత్రిలో చేరడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హాస్పిటల్ బెడ్‌పై ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని ఉన్న పిక్‌ను ఆమే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శ్రీహరి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

61 ఏళ్ల డిస్కో శాంతి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. తాజాగా "ఇంటికి తిరిగొచ్చాను" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే తను ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.. అసలు ఏం జరిగిందనే విషయాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు.

డిస్కో శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి రీసెంట్‌గా తన 26వ బర్త్‌డే జరుపుకున్నాడు. సోషల్ మీడియాలో తనకు వచ్చిన విష్‌లను ర...