భారతదేశం, అక్టోబర్ 27 -- Dil Raju Vrushakarma: టాలీవుడ్ అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma). సాయి ధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' వంటి సంచలన బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కార్తీక్ (Karthik) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమా ప్రారంభం నుంచే పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బాక్సాఫీస్ థియేట్రికల్ బిజినెస్ విపరీతమైన వేడిని పుట్టిస్తోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లాకింగ్ డీల్ అధికారికంగా కుదిరింది. ప్రసిద్ధ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 38 కోట్ల అడ్వాన్స్ + ...