భారతదేశం, మే 27 -- Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా జయాపజయాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను ఆయన ముందే అంచనా వేయగలరని ఇండస్ట్రీలో అందరూ నమ్ముతారు. అలాంటి సీనియర్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిపై అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ఎలాంటి ముసుగు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

టాలీవుడ్ లో వస్తున్న మరో చిన్న సినిమా సమ్మర్ హాలిడేస్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పరిస్థితిపై ఆయన స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.

"చాలా మంది భయపడతారు కానీ.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ఈ విషయాన్ని నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను.." అని ఆయన...