భారతదేశం, అక్టోబర్ 19 -- Diamonds Bra: అంతర్జాతీయ ఫ్యాషన్ రంగాన్ని ప్రముఖ గ్లోబల్ బ్యూటీ ఐకాన్, బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ (Kylie Jenner) మరోసారి తన గ్లామర్‌తో ఊపేసింది. ప్రఖ్యాత గ్లోబల్ ల్యాంగరీ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్ (Victoria's Secret) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ర్యాంప్‌పై తొలిసారి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో ఆమె ధరించిన డైమండ్ స్టడెడ్ 'ఫాంటసీ బ్రా' (Fantasy Bra) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఏకంగా 50 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు Rs.474 కోట్లు) విలువ చేసే అత్యంత ఖరీదైన 'ఫాంటసీ బ్రా'తో కైలీ ర్యాంప్‌పై మెరుపులు మెరిపించింది. ఇప్పటివరకు విక్టోరియా సీక్రెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బ్రా కంటే ఇది 35 మిలియన్ డాలర్లు ఎక్కువ కావడం విశేషం.

ప్రఖ్యాత హై-ఎం...