భారతదేశం, మే 21 -- Diet Changes To Reduce Diabetes risk : షుగర్ వ్యాధి లేదా మధుమేహం అనేది మనం రోజువారీ తినే ఆహారం, జీవనశైలిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినకపోవడం, పోషకాలు లేని జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతోంది. అయితే, ఒక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ (అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్)లో ప్రచురితమైన అధ్యయనం (PREDIMED- Plus) ప్రకారం.. ఆహారంలో మూడు ముఖ్యమైన మార్పులు చేసుకుంటే మధుమేహం రాకుండా సులభంగా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఈ పరిశోధన కోసం 55 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, మెటబాలిక్ సిండ్రోమ్ (జీవక్రియ లోపాలు) తో బాధపడుతున్న 4,700 మంది పెద్దలను సుమారు ఆరేళ్ల పాటు పరిశీలించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించగా.. ప్రత్యేక డైట్ నియమాలను పాటించిన మొదటి గ్ర...