భారతదేశం, మార్చి 2 -- బాక్సాఫీస్ దగ్గర భారీ ఫైట్ కు టైమ్ దగ్గరపడుతోంది. మార్చి నెలలో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కాబోతుంది. రెండు భారీ ప్రాజెక్టులు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన ధురంధర్ 2, యశ్ మూవీ టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. మార్చి 19, 2026న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

మార్చి నెల వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్, బాక్సాఫీస్ ఎక్స్ పర్ట్స్ ఫోకస్ మొత్తం ధురంధర్ 2, టాక్సిక్ పైనే ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఇది మెగా క్లాష్ కానుంది. ఇప్పుడు ఈ సినిమాల మధ్య పోరే హాట్ టాపిక్ గా మారింది.

ధురంధర్ 2, టాక్సిక్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాల ప్రీమియర్ల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యా...