భారతదేశం, మార్చి 18 -- ధురంధర్ 2.. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సీక్వెల్. ఈ సినిమా గురువారం (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. అతడు తన ఎక్స్ అకౌంట్లో ఓ సుదీర్ఘ పోస్ట్ రాశాడు. అందులో ఏముందో చూడండి.

ధురంధర్ 2 మూవీపై తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. "ఒక్క మాటలో చెప్పాలంటే.. ధురంధర్ ది రివేంజ్ ఒక మాస్టర్‌పీస్. సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించేలా ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్కేల్, డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, పర్ఫార్మెన్సెస్, ఇంపాక్ట్.. ఇలా ప్రతి విషయంలోనూ సినిమా అదరగొట్టేసింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar)కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇది పక్కా ఎపిక్ బ్లాక్‌బస్టర్" అని తరణ్ అన్నాడు.

"ఫస్ట్ ప...