భారతదేశం, మార్చి 20 -- ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో ల్యాండ్ అయ్యింది. బుధవారం సాయంత్రం వేసిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. ఫస్ట్ బాలీవుడ్ మూవీగా నిలిచింది.

ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోల ద్వారానే ఇండియాలో రూ.43 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. ప్రీమియర్ షో ద్వారా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఇది నిలిచింది. ఇక గురువారం (మార్చి 19) ఫస్ట్ డే ఉదయం నుంచే థియేటర్ల దగ్గర జాతర మొదలైంది.

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే ముగిసే సరికి ఇండియాలోనే రూ.146 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ డేనే నెట్ కల...