భారతదేశం, మార్చి 25 -- బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ధురంధ‌ర్‌: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ధురంధర్ 2 సినిమా రన్నింగ్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కలెక్షన్లే నిదర్శనం. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 సినిమాకు ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు రూ.687.43 కోట్లుగా ఉన్నాయి....