భారతదేశం, మార్చి 26 -- ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధ‌ర్ 2: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డామినెన్స్ కొనసాగిస్తోంది. తగ్గేదే లేదన్నట్లుగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఏడో రోజు కూడా అదరిపోయే వసూళ్లు రాబట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డుపై ఈ మూవీ కన్నేసింది.

పాజిటివ్ టాక్ తో, సెలబ్రిటీల ప్రశంసలతో ధురంధర్ 2 కు అడ్డన్నదే లేకుండా పోయింది. ఈ సినిమా ఏడో రోజైన బుధవారం (మార్చి 25) కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఇండియాలో రూ.47.70 కోట్ల నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లలో అదరగొట్టింది.

ధురంధర్ 2 ఇండియా కలెక్షన్లు రూ.623.42 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. ఏడో రోజుల్లోనే ధురంధర్ 2 సినిమా ఈ రేంజ...