భారతదేశం, మార్చి 30 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్ 2' ప్రభంజనం ఆగడం లేదు. రెండో వారాంతంలోనూ ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. 11వ రోజైన రెండో ఆదివారం (మార్చి 29) నాడు ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.

తాజా లెక్కల ప్రకారం మార్చి 29 (రాత్రి 10 గంటల సమయానికి) 'ధురంధర్ 2' కేవలం 11వ రోజే దేశవ్యాప్తంగా రూ. 69.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1,013.15 కోట్లకు చేరుకున్నాయి. అదే నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే రూ. 847.87 కోట్లతో దూసుకుపోతోంది.

ఇక అంతర్జాతీయంగా కూడా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ. 350 కోట్...