భారతదేశం, మార్చి 29 -- ధురంధర్ 2: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి 2' నెలకొల్పిన తొమ్మిదేళ్ల నాటి రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఈ పరిణామం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ధురంధర్ 2 రికార్డుల వేటపై బాహుబలి చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. "ధురంధర్ 2 చూశా. సినిమాను పూర్తిగా ఆస్వాదించా! భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టి, కొత్త బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం చూసి చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు" అంటూ ఆయన పోస్ట్ చేశారు.

నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా బాహుబలి 2 ($20.19 మిలి...