భారతదేశం, మార్చి 18 -- రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ థియేటర్లలోకి రాకముందే చరిత్ర సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ భారీ సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లోనూ ధురంధర్ 2 రికార్డులు తిరగరాస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా ధురంధర్ 2 దూసుకెళ్తోంది.

ధురంధర్ 2 బాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా విడుదలైన సీక్వెల్ గా నిలవనుంది, మొదటి చిత్రం విడుదలై 100 రోజులు దాటకముందే ధురంధర్ 2 వస్తోంది. ధురంధర్ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ధురంధర్ 2 ఏమో రేపు (మార్చి 19)న థియేటర్లకు రాబోతోంది.

సక్నిల్క్ నివేదికల ప్రకారం ధురంధర్ 2 తన ఫస్ట్ డే, ప్రీవ్యూ షోల కోసం జాతీయ మల్టీప్లెక్స్ చైన్‌లలో ఏకంగా 6 లక్షల టిక్కెట్లను విక్రయించింది. ఇ...