Dhurandhar 2: నా సిక్సర్ పాకిస్థాన్‌లో పడింది..సచిన్ టెండూల్కర్‌తో ధురంధర్ 2 నటుడు..మజా వచ్చిందన్న క్రికెట్ గాడ్
భారతదేశం, ఏప్రిల్ 5 -- ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లో ఊపేస్తోంది. అయితే, ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో సమానంగా ఒక సీనియర్ నటుడి పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనే రాకేష్ బేడీ. సాధారణంగా కామెడీ పాత్రలతో మెప్పించే రాకేష్ బేడీ, ఇందులో జమీల్ జమాలి అనే కుటిల రాజకీయనాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.
ధురంధర్ 2 చిత్రంలో రాకేష్ బేడీ నటనకు ఫిదా అయిన వారిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. ఇటీవల 'ది లల్లంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత సచిన్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారని ఆయన తెలిపారు.
"రాకేష్ జీ, అద్భుతంగా నటించారు.. మీరు సినిమాలో కొట్టిన సిక్స్ మామూలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.