భారతదేశం, మార్చి 1 -- మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ అదిరిపోయింది. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని చేరాడు. ధోని ఎంట్రీ, సీఎస్కే జెర్సీ లాంఛ్ కోసం ఆ ఫ్రాంఛైజీ క్రియేట్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలోని 'టైగర్ కా హుకుం' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే ధోని ఎంట్రీ అదిరిపోయింది.

ఐపీఎల్ 2026 కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ తన జెర్సీ లాంఛ్ కోసం స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డెన్ కమింగ్ జెర్సీ హీస్ట్ అంటూ వీడియోతో అదరగొట్టింది. ఈ వీడియోలో సీఎస్కే జెర్సీ ఉన్న బ్యాగ్ ను ఓ దొంగ వచ్చి తీసుకెళ్తాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో సహా సీఎస్కే ఆటగాళ్లు టీమ్ హోటల్ కు చేరుకుంటారు. జెర్సీ కోసం వెళ్లగా అక్కడ బ్యాగ్ ఉండదు.

జెర్సీ బ్యాగ్ కనిపించకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ వెంటనే త...