భారతదేశం, జూలై 4 -- Dharman: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే ఇండియన్ బాక్సాఫీస్ కు పూనకాలు గ్యారెంటీ. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ హీరోగా 'ధర్మన్' అనే క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్ గా ఎనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు కొట్టేశాడు. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తుండటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అశ్వత్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

"ధర్మన్ సినిమా నా లైఫ్ ల...