భారతదేశం, జూన్ 9 -- Dhanush Review: వరల్డ్ టెన్నిస్ హిస్టరీలో రఫెల్ నదాల్ పేరు ఓ సెన్సేషన్. కోర్టులో అతడు చూపించే పట్టుదల, ఫైటింగ్ స్పిరిట్ కోట్లాది మందికి ఇన్‌స్పిరేషన్ గా నిలిచాయి. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైన అతని బయోపిక్ డాక్యుమెంటరీ సిరీస్ 'రఫా' (Rafa) ఇప్పుడు స్పోర్ట్స్, సినిమా ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ డాక్యుమెంటరీని చూసిన హీరో ధనుష్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు. తాను నదాల్‌కు ఎంతటి డైహార్డ్ ఫ్యాన్‌నో చెప్తూ.. నదాల్ ఆడిన మ్యాచ్‌లను చూస్తూనే తన లైఫ్ లో సగానికి పైగా కాలం గడిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.

టెన్నిస్ కోర్టులో రఫెల్ నదాల్ పడ్డ శారీరక బాధ, మానసిక ఒత్తిడిని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టినట్లు చూపించిందని ధనుష్ చెప్పారు. తాను కేవలం ఏదో సినిమా ప్రమోషన్ కోసం ఈ పోస్ట్ పెట్టడం లేదని, ఒక నిజమైన...