భారతదేశం, జూలై 11 -- Dhanush Murugan: సౌత్ ఇండియాను షేక్ చేసిన 'అసురన్', 'వడ చెన్నై' లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ కాంబో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ మళ్లీ ఒక్కటయ్యారు. ఎప్పటినుంచో నడుస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ వీళ్లిద్దరి కొత్త ప్రాజెక్ట్ 'తమిళ్ మురుగన్' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి (లార్డ్ మురుగన్) కాన్సెప్ట్‌తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుండటంతో అదే కాన్సెప్ట్ లో వస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పోటీ కానుంది.

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పొల్లాదవన్', 'ఆడుకలం' నుంచి మొన్నటి 'అసురన్' వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అవార్డులు కూడా కొల్లగొట్టాయి. నిజానికి ధనుష్, వెట్రిమారన్ కాంబోలో 'వడ చెన్నై 2' వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు...