భారతదేశం, నవంబర్ 20 -- Dhanush: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెజెండ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నోటి నుంచి ఒక్క ప్రశంస వస్తే చాలు, ఏ నటుడికైనా అది ఆస్కార్ తో సమానం. అలాంటి బిగ్ బీ.. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ పై మరోసారి తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో, ధనుష్ నటన, డ్యాన్స్ ప్రతిభను ఆకాశానికెత్తారు.

తాజాగా విడుదలైన కేబీసీ ప్రోమోలో, హాట్ సీట్‌లో కూర్చున్న ఒక కంటెస్టెంట్ తాను తమిళ స్టార్ హీరో ధనుష్‌కు వీరాభిమానినని అమితాబ్‌తో చెప్పాడు. దీనికి అమితాబ్ ఎంతో ఆప్యాయంగా స్పందిస్తూ.. "నువ్వు ధనుష్‌కు పెద్ద అభిమానివని చెప్పావు కదా.. నీకూ నాకూ మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. నేను కూడా ధనుష్‌కు చాలా పెద్ద అభిమానిన...